CM Jagan : నేడు హైదరాబాద్ కు సీఎం జగన్.. కేసీఆర్ తో కీలక భేటీ.. షెడ్యూల్ ఇదే..!!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి..11.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు.

New Update
CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్

Key Meeting With Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్(Hyderabad) రానున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) తో భేటీ కానున్నారు. గతనెల 8న కేసీఆర్ కాలుజారి కిందపడిన సంగతి తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కేసీఆర్ కాలు ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. కొద్దికాలంగా కేసీఆర్ యశోద ఆసుపత్రి(Yashoda Hospital) లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉణ్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నాయులు, బీఆర్ఎస్(BRS) నేతలు ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్ బంజారాహిల్స్ లో ఉన్న నందినగర్ లోని తన పూర్వ నివాసానికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు.

ఇది కూడా చదవండి: షుగర్ పేషంట్లు ఈ 5 పదార్థాలు ఆహారంలో చేర్చుకోండి…షుగర్ పెరగమన్నా పెరగదు…!!

జగన్ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే:

ఉదయం 10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతారు జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). 10.30గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి 11.15 నిమిషాలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్ లోఉన్న కేసీఆర్ నివాసానికి 11.20 నిమిషాలకు చేరుకుంటారు. 11.30 నుంచి 12.30గంటల వరకు అంటే దాదాపు 1 గంటపాటు కేసీఆర్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. భేటీ అనంతరం 12.40గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. 12.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జగన్ తన అధికారిక నివాసానికి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

publive-image

కాగా కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారిగా జగన్..కేసీఆర్ తో భేటీ కానున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ సర్కార్ తో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవైపు తాజాగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు