Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు (Radhakishan Rao) వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి రెడ్డి ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు చెప్పారు. జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలిపారు.
Also read: ప్రతి పదేళ్లకు బంగాళాఖాతంలో భారీ తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయో మీకు తెలుసా..?
బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు పేర్కొన్నారు. అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై నిఘా పెట్టారని.. అలాగే కడియ శ్రీహరితో రాజయ్య విభేదాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపై కూడా నిఘా పెట్టినట్లు చెప్పారు. అలాగే మీడియా యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలిపారు.
మాజీమంత్రి ఆదేశాలతో ప్రణీత్‌రావుతో (Praneeth Rao) ఓ మీడియా యజమాని డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లారని.. మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతోనే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలంలో వివరించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు మీడియా యజమాని అందించారని తెలిపారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆర్థికసాయం చేసే వారిపై అలాగే బీఆర్‌ఎస్‌ను ట్రోలింగ్ చేసిన వారిపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
Also read: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే