Central Cabinet Meeting : ఢిల్లీ (Delhi) లోని కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఎన్డీయే (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ (PM Modi) అధ్యక్షతన జరిగిన ఈ మొదటి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయించారు. ధాన్యం, రాగి, జవార్, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతు ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2300 వరకు పెంచేందుకు కేబినేట్ సభ్యులు ఆమోదం తెలిపారు.
Also Read: బీహార్ లో కుప్పకూలిన వంతెన..ఆవిరైన రూ.12 కోట్లు! షాకింగ్ వీడియో!
గత దశాబ్దం 2013-2014 మద్దతు ధరతో పోలిస్తే.. ఈసారి భారీగా పెరిగిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అన్నారు. రైతులకు రూ.2 లక్షల కోట్ల వరకు మద్దతు ధర వస్తుందని పేర్కొన్నారు. గత మద్దతు ధరతో పోలిస్తే.. రూ.35 వేల కోట్లు పెరిగిందని వెల్లడించారు. క్వింటాల్‌కు మద్దతు ధర పెరిగిన పంటలు ఇవే.
- వరి: రూ. 2,300
- పత్తి: రూ. 7,521
- జోవర్: రూ. 3,371
- రాగి: రూ. 2,490
- బజ్రా: రూ. 2,625
- మొక్కజొన్న: రూ.2,225
- మూంగ్: రూ. 8,682
- టర్: రూ. 7,550
- ఉరద్: రూ. 7,400
- నువ్వులు: రూ. 9,267
- వేరుశనగ: రూ.6,783
- రేప్ సీడ్స్: రూ. 8,717
- పొద్దుతిరుగుడు: రూ. 7,280
- సోయాబీన్: రూ.4,892