BIG BREAKING: తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా!

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ టికెట్ విషయంలో నాని, చిన్ని మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీతోపాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నాని ప్రకటించారు.

New Update
BIG BREAKING: తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా!

Kesineni Nani Resign to TDP: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వట్లేదని చంద్రబాబు (Chandrababu) తేల్చి చెప్పారని ప్రకటించిన నాని.. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు.

విజవాడ (Vijayawada) టికెట్ అంశంలో నాని, చిన్ని (Chinni) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇక తన సేవలు టీడీపీకి అవసరం లేదని, చంద్రబాబుకు కూడా తన అవసరం పార్టీకీ లేదని బావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.ఈ మేరకు త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ని కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటాని తెలిపారు. ఆయన ఆమోదం తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : Christian Oliver Died: విషాదం..విమాన ప్రమాదంలో ప్రముఖ నటుడు,ఆయన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం..!!

నాని, చిన్ని వివాదం..
నాని, చిన్ని వివాదం నేపథ్యంలో లో చిన్ని వైపే అధిష్టానం మొగ్గుచూపుతోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ నానికి చెప్పిన టీడీపీ అధిష్టానం.. తిరువూరు సభ నిర్వహణ బాధ్యతలను సైతం చిన్నికి అప్పగించడంతో నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన..ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి.. ఈ రోజు రాజీనామా చేయబోతుండటం చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు విధేయుడుగానే ఉంటానని ప్రకటించి అనూహ్యంగా ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రాబోయే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#tdp #kesineni-nani #resigned #mp #keshineni-nani
Advertisment
Advertisment
తాజా కథనాలు