Brain-Eating Amoeba : కలవరపెడుతున్న మెదడు తినే అమిబా.. తాజాగా మరో కేసు

కేరళలో బుధవారం మెదడును తినే అమీబా వ్యాధి బారిన పడి ఓ14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. దీంతో సీఎం పినరయ్‌ విజయన్‌ ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Brain-Eating Amoeba : కలవరపెడుతున్న మెదడు తినే అమిబా.. తాజాగా మరో కేసు
New Update

Kerala : మెదడును తినే అమీబా (Brain Eating Amoeba) (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్) మరోసారి కలకలం రేపుతోంది. కేరళలోని బుధవారం ఈ అరుదైన వ్యాధి బారిన పడి ఓ 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. కోడికోడ్ జిల్లాలో పయోలి అనే ప్రాంతంలో ఉంటున్న మరో 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకడంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

అమీబా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. శుక్రవారం సీఎం పినరయ్‌ విజయన్ (CM Pinarayi Vijayan) ఉన్నతస్థాయి వైద్యాధికారులతో చర్చలు జరిపారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నందున నీటి కుంటలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కలుషిత జలాల్లో ఉండే అమీబా బ్యాక్టీరియా ముక్కు నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌ (Amoebic Meningoencephalitis) అనే వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది మే నెలలో మలప్పురంలో ఐదేళ్ల బాలకి మృతి చెందగా.. జూన్‌లో కన్నూర్‌లో 13 ఏళ్ల మరో బాలిక కూడా ఇదే వ్యాధితో మరణించింది. అలాగే 2017, 2023లో అలప్పుజ జిల్లాలో ఈ అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్ కేసులు వెలుగుచూశాయి.

Also Read: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా

#telugu-news #cm-pinarayi-vijayan #brain-eating-amoeba #amoebic-meningoencephalitis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe