National: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళ డీజీగా సాధనా సక్సేనా నాయర్ ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఈరోజే సాధనా ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. By Manogna alamuru 01 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Army Medical services DG: భారత ఆర్మీలో ఇప్పటివరకు మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా మహిళలను నియమించలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్‌ను తద్వారా ఈ కీలక పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందనున్నారు. ఇంతకుముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డైరెక్టర్ జనరల్ అయ్యారు. చదువుపై ఉన్న ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. Also Read:Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి #sadhna-saksena #medical-services-dg #indian-army మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి