Kerala: ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌

వయనాడ్‌ ప్రకృతి వైపరిత్యం జరిగిన ప్రాంతానికి వెళుతుండగా కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ కారుకి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. మరోవైపు వయనాడ్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సంఖ్య 254 కు చేరుకుంది.

New Update
Kerala: ప్రమాదానికి గురైన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌

Kerala Health Minister Veena George:భారీ వర్షాల కారణంగా వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి బుధవారం తన కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా వుంటే వయనాడ్‌లో మృత్యుఘోష ఆగడం లేదు. ఇప్పటికి దాదాపు 254 మంది మరణించినట్లు తెలుస్తోంది.

నాలుగు రోజుల వరకు అదొక ప్రకృతి పర్యాటక ప్రాంతం . కానీ ఇప్పుడు బురద, శిథిలాలు, మృత్యుఘోషతో నిండిపోయింది. కేరళలోని చురల్‌మలలోని సూచిపర జలపాతం, వెల్లొలిప్పర, సీతా సరస్సు లాంటి ప్రాంతాలకు పర్యాటకులు విపరీతంగా వస్తారు. ఇప్పుడు అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రదేశాలన్నీ విధ్వంసంగా తయారయ్యాయి. దాంతో పాటూ కొంచరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈరోజు ఈ సంఖ్య 254కు చేరుకుంది. దాంతో పాటూ మరో మూడు వందల మంది ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: National: ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌ తొలి మహిళ డీజీగా సాధనా సక్సేనా నాయర్‌

Advertisment