Kerala: అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పినరయ్‌ విజయన్‌

కేరళలో వైపరీత్యం ముంచుకొస్తుందని ముందుగా హెచ్చరించినా అప్రమత్తం కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్పందించారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందన్నారు.

New Update
Kerala: అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పినరయ్‌ విజయన్‌

కేరళలోని వాయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళను జులై 23నే హెచ్చరించామని వారే అప్రమత్తం కాలేదని కేంద్రమంత్రి అమిత్‌ షా బుధవారం పార్లమెంటులో చెప్పారు. అయితే దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ కౌంటర్ వేశారు. ఇది పరస్పర నిందారోపణలకు సమయం కాదని అన్నారు. కొండచరియలు విరిగిపడే ముందు వాతావరణ శాఖ (IMD) కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని పేర్కొన్నారు.

Also Read: ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ

ఐఎండీ అంచనాలకు మించి వయనాడ్‌లో 500 మి.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇది ఐఎండీ హెచ్చరికలు చాలా అధికమన్నారు. వైపరీత్యానికి ముందు ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా రెడ్ అలర్ట్‌లో లేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆరు గంటలకు రెడ్ అలర్ట్‌ జారీ చేశారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ

మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడం వల్లే ఈ భారీ వర్షాలకు కారణమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అరేబీయా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడటంతో వయనాడ్‌, కొలికోడ్‌, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలకు దారీ తీశాయన్నారు. 2019లో కేరళలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన రాడార్‌ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ అభిలాష్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు