కేసీఆర్‌ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది.. అందుకే ప్రభుత్వ పరం మాట

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు.

కేసీఆర్‌ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది.. అందుకే ప్రభుత్వ పరం మాట
New Update

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిందని, ఆర్టీసీకి చెందిన వేల ఎకరాలను లాక్కోవాలని దురాశతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

తెలంగాణలోని పేదల భూములు లాక్కున్న కేసీఆర్‌.. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ భూములను తన బినామీలకు తక్కువ ధరకే అమ్మారని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ దృష్టి ఆర్టీసీ ఆస్తులపై పడిందని ఇప్పుడు వాటిని కూడా అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. గత 9 సంవత్సరాలుగా ఆర్టీసీని పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు దానిపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు కేసీఆర్‌కు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారన్న ఎంపీ.. అనంతరం కేసీఆర్‌ వారి ఇబ్బందులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తే సంస్ధ నష్టాల్లో ఉందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని కేసీఆర్‌ తేల్చి చెప్పారని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని, అందుకోసమే కేసీఆర్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కానీ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తున్నట్లు తెలిపిన కేసీఆర్‌.. ఆర్టీసీ కార్మికులకు ఇతర ప్రభుత్వ  ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా  పింఛన్ సదుపాయాన్ని కల్పిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల భద్రత గురించి ఫైళ్లలో ఎలాంటి అంశాలను  చేర్చకుండానే బిల్లు ఎలా పాస్‌ చేశారన్నారు. కల్వకుంట్ల పాలనలో ఆర్టీసీ కార్మికులు నలిగిపోతున్నారని, దీనిని ఆర్టీసీ కార్మికులు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న మోసం గురించి తెలుసుకోవాలని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తోందని, అవినీతిపరుడు, నియంత పాలకుడైన కేసీఆర్‌ గురించి రైతులకు, ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు.  కాంగ్రెస్‌తో కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే.. కాంగ్రెస్‌కు వేసినట్లే అని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్‌ఎస్‌ వేసినట్లే నని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

#brs #kcr #bjp #kishan-reddy #rtc #assets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe