మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ప్రముఖ జ్యోతిష్యుడు నమిలికొండ రమణ చార్యులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రేవంత్ రెడ్డికి గ్రహాబలం ఉనప్పటికీ కేసీఆర్ కే రాజయోగం ఉందని చెప్పారు. మరో మూడేళ్ల 6 నెలలు కేసీఆర్ సీఎంగా ఉంటారన్నారు.

మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు
New Update

Telangana Next CM Prediction: తెలంగాణలో ఏపార్టీ గెలవబోతుందనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే విషయంపై కొన్ని కొట్ల రూపాయల బెట్టింగ్ కూడా జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య బీకర పోరు ఉండబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ప్రకటించాయి. పబ్లిక్ టాక్ మొత్తం కాంగ్రెస్ రాబోతుందంటున్నప్పటికీ మరికొన్ని సర్వేలు మాత్రం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వమే రాబోతుందని బలంగా వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా Rtv తో మాట్లాడిన ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, వేద పండితులు నమిలికొండ రమణ చార్యులు (Ramanacharyulu).. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారనే విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రమణ చార్యులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడం పార్టీకి అనుకూలించలేదన్నారు. పార్టీ పేరు మార్చిన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. అలాగే జాతకం ప్రకారం బీఆర్ఎస్ ధనుస్సు రాశీ కిందకు వస్తుంది. కాంగ్రెస్ మిధున రాశీ. ఈ రెండు రాశుల ప్రభావం చూస్తే బీఆర్ఎస్ కు మూడు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. గురు, శుక్ర, శని బాగున్నాయి. కానీ కాంగ్రెస్ మిథున రాశీకి సూర్యుడు ఆరోవ స్థానంలో ఉన్నాడు. కుజుడు మూడో తారీఖు నాటికి ఆరోవ స్థానంలో ఉంటాడు.11 వస్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి ఈసారి గ్రహాలు కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ కు ప్రజాధారణ దక్కిందని తెలిపారు.

Also read :MLC Kavitha: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?

కేసీఆర్ కే రాజయోగం:
ఇక యోగం ప్రకారం చూస్తే కేసీఆర్ కు 12 సంవత్సరాల 6 నెలల రాజయోగం ఉందన్నారు. 9ఏళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ ఇంకా మూడు సంవత్సరాల మూడు నెలలు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండే అవకాశం ఉందన్నారు. కానీ గ్రహస్థితులు మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, కుజుని ప్రభావంతో రెండున్నర నెలలకు కాంగ్రెస్ గవర్నమెంట్ తలకిందులు అయ్యే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా జరిగితే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. గ్రహ బలంకంటే యోగబలమే చాలా కీలకం. ఒకవేళ ఇప్పుడు అధికారం దక్కకపోయిన తర్వాత అయినా మరో మూడేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాజశ్యామల దేవీ యాగం కొంత ఊరట, ఫలితాలను ఇస్తుంది. కానీ రాజయోగం ఇవ్వవు. చంఢీ యాగం, ఆయుత చంఢీయాగమే కేసీఆర్ కు తిరుగులేని శక్తినిచ్చింది. కానీ దాని ప్రభావం ఇప్పుడు తగ్గపోతుందని వెల్లడించారు.

రేవంత్ కు గ్రహబలం :
అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గ్రహచారం కేసీఆర్ కంటే బాగుందని చెప్పారు. ఈ యేడాది రేవంత్ కు రాజయోగం దక్కే అవకాశం ఉంది. అయితే కొన్ని గ్రహాల శని వల్ల ఎక్కువకాలం అధికారం ఉండకపోవచ్చని జాతకం చెబుతుందన్నారు. 2006నుంచి రేవంత్ రెడ్డిని శని వెంటాడుతుండగా ఈ యేడాదితో ముగుస్తుంది. దీంతో ఆయనకు రాజయోగం కలగవచ్చు అంటూ జనాల్లో మరింత క్యూరియాసిటీ పెంచేశారు.

#kcr #telangana #revanth-reddy #cm-kcr #ramana-charyulu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe