KCR District Tours: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తరువాత ప్రజల ముందుకు వస్తారని అన్నారు. త్వరలో తెలంగాణ భవన్ లో కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అవుతారని హరీష్ తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన (KCR District Tours) చేపడుతారాని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కోసం పని చేస్తున్న ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎన్నికల్లో ఓటమి మనకు ఓ స్పీడ్ బ్రేకర్ లాంటిందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ALSO READ: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ
కేసీఆర్ అందరి గుండెల్లో..
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పేరును ప్రజల్లో లేకుండా చేసేందుకే కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేయడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగించినా తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించ లేరని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
టార్గెట్ గా బీఆర్ఎస్ కార్యకర్తలు..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Party) రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలపై ఉద్యమిస్తాం అని అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల పై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలంతా బస్సులో బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు అన్నారు.
ALSO READ: మంచు లక్ష్మీకి అదిరిపోయే సవాల్ విసిరిన మెగా హీరో.. షాక్ లో మోహన్ బాబు ఫ్యామిలీ