KCR : ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. మొత్తం 17రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 21 రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు By B Aravind 24 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ex. CM KCR : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) మొదలయ్యాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం(Election Campaign) లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. ముందుగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి బస్సు యాత్రకు బయలుదేరనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. అక్కడి నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 5.30 PM గంటలకు మిర్యాలగూడలో తొలి రోడ్ షోలో పాల్గొననున్నారు. Also Read: కేసీఆర్‌ను కడియం బ్లాక్‌మెయిల్ చేశారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు మొత్తం 17రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. 21 రోడ్ షోల్లో ఆయన పాల్గొనున్నారు. మే 10న సిద్దిపేటలో కేసీఆర్ బస్సుయాత్ర(KCR Bus Yatra) ముగియనుంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలను కవర్ చేసుకుంటూ రోడ్ షోలు వేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు తీసుకొచ్చేందుకు.. కేసీఆర్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఏప్రిల్ 19 నుంచి మొదలైన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశల్లో జూన్ 1 వరకు జరగనున్నాయి. మే 13న తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. Also Read: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన #telugu-news #telangana-news #2024-lok-sabha-elections #kcr-bus-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి