BRS Chief KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై నజర్ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని పెంచేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఈ రోజు తన పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై వారితో చర్చించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. ఢిల్లీలో ఉన్న 16 మంది ఎంపీలను వెంటనే హైదరాబాద్ కు రావాలని కేసీఆర్ నిన్న ( మంగళవారం) కబురు పంపారు. కేసీఆర్ పిలుపుతో హైదరాబాద్ కు చేరుకున్నారు ఎంపీలు. కాసేపట్లో కేసీఆర్ తో వారు భేటీ కానున్నారు.
ALSO READ: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్…కేటీఆర్ ఆన్ ఫైర్!
సీటింగులకే ఎంపీ టికెట్?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ టికెట్ల కేటాయింపు పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలకే కేసీఆర్ టికెట్ ఇస్తారా? లేదా కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనే గుసగుసలు పెడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ నేతలు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించడం అని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకదే కేసీఆర్ ను సీఎం కుర్చీ నుంచి దించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.
ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యలో బీఆర్ఎస్ మంత్రులు ఓడిపోవడం గమనార్హం. అయితే, ఇప్పుడు వారు ఎంపీ టికెట్ల కోసం ఆశ పెట్టుకరని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయినందున ఈ సారి తమకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను అడుగుతున్నట్లు సమాచారం. ఓటమి సానుభూతి, కేసీఆర్ ఫేస్ తో ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.