BRS Chief KCR: లోక్ సభ ఎన్నికలకు సిద్దమైయ్యారు కేసీఆర్. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయేందుకు ఇటీవల పర్యటనలు చేపట్టారు. ఇటీవల సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు కోరింది. కాగా వివరణ ఇచ్చేందుకు వారం గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు. మరి కేసీఆర్ అడిగిన రిక్వెస్ట్ పై ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
ALSO READ: హైదరాబాద్ వాసులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్!
అసలేం జరిగిందంటే..
ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. కాగా.. సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపింది. గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళుతుండడంతో ఈసీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
జగన్, చంద్రబాబుకు కూడా నోటీసులు..
ఇటీవల ఏపీలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కూడా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఎన్నికల కోడ్ ఉల్లఘించి ప్రచారాల్లో ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వారికి నోటీసులు పంపింది. కాగా ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు రెచ్చిపోయి హింసకు దారి తీసేలా జరుగుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఒకవేళ నోటీసులు ఇచ్చిన ఏ నాయకుడు అయినా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని ఈసీ హెచ్చరించింది.