KCR Health:కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయాల్సిందేనని తేల్చారు యశోద మాస్పిటల్ డాక్టర్లు. ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆపరేషన్ జరగనుంది. మరోవైపు కొత్త సీఎం రేవంత్ రెడ్డి తన టీమ్ ను హాస్పటల్ దగ్గరకు పంపించి కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.

KCR Health:కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్.
New Update

KCR Health Update: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయనున్నారు యశోద హాస్పటల్ (Yashodha Hospital) వైద్యులు. రాత్రి నుంచి పలురకాల టెస్ట్ లు నిర్వహించాక ఈ ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడగా.. ఆయన తుంటి ఎముక విరిగింది.దాంతో ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి నడుస్తుండగా పంచె కాళ్ళకు అడ్డంపడి కేసీఆర్ పడిపోయారని తెలుస్తోంది. దాంతో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరిగింది.

Also Read: కలిసిమెలిసి ఉందాం..తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్లు

సీఎం పర్యవేక్షణ
కేసీఆర్ ఆరోగ్యంపై నూతన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వాకబు చేస్తున్నారు. యశోద హాస్పటల్ కు ఐఏఎస్ బృందాన్ని పంపించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. దాంతో పాటూ కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి యశోద హాస్పిటల్ వెళ్ళారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద వైద్యులు హెల్త్ సెక్రటరీకి తెలిపారు.  నిన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే నూతన ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారులు హాస్పటల్ కు తరలించారు.

ఇక కేసీఆర్‌ హెల్త్ బులిటెన్  యశోద యాజమాన్యం రిలీజ్ చేసింది.  కేసీఆర్ కు 6 నుంచి 8 వారాలపాటు రెస్ట్ డాక్టర్స్ తెలిపారు. సాయంత్రం 4గంటలకు కేసీఆర్‌ ఎడమతుంటికి సర్జరీ ఉంటుందని..సర్జరీ బృందంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఉంటారని తెలిపారు.

#kcr #revanth-reddy #yashoda-hospital #health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe