KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్‌ భారీ బహిరంగ సభ..!

నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్‌ఎస్‌ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్‌ భారీ బహిరంగ సభ..!
New Update

KCR To Attend Nalgonda Public Meeting Today : మాజీ సీఎం కేసీఆర్‌(Ex. CM KCR) రణరంగంలోకి దూకుతున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న కేసీఆర్‌... ఇప్పుడు నేరుగా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇవాళే(ఫిబ్రవరి 13) నల్గొండలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ నేరుగా ప్రజల వద్దకు రావడం ఇదే తొలిసారి. దీంతో బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు ఈ మీటింగ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమ అభిమాన నాయకుడి స్పీచ్‌ వినేందుకు గులాబీ కార్యకర్తలు నల్గొండకు క్యూ కట్టారు.

దక్షిణ తెలంగాణ రైతులకు నష్టం?

నల్గొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌రోడ్డులో ఈ సభ జరగనుంది. 50 ఎకరాల స్థలంలో జరగనున్న భారీ బహిరంగకు బీఆర్‌ఎస్‌ ఎమ్యేల్యేలు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టారు. మ:3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతుగర్జన పేరిట ఈ సభ జరగనుంది. సాగునీటిపై తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు మరో ప్రజా ఉద్యమం చేపట్టాలని బీఆర్‌ఎస్ క్యాడర్‌కు కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి, దృక్పథం వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతుల(Telangana Farmers) సాగు నీటి హక్కు ప్రమాదంలో పడుతుందంటోంది బీఆర్‌ఎస్‌.

మరో ప్రజా ఉద్యమం?

నాగార్జున సాగర్‌, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(KRMB) కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామంటోంది బీఆర్‌ఎస్‌. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటాపై వచ్చే ఆరు నెలల్లోగా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును ఖరారు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లాలని కూడా బీఆర్‌ఎస్‌ కోరుతోంది.

Also Read : ఒక ముద్దు అనేక వ్యాధుల నుంచి కాపాడుతుందని మీకు తెలుసా!

WATCH:

#brs #nalgonda #revanth-reddy #congress #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe