అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జాతర నడుస్తోంది. ప్రస్తతం నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు అధికార, విపక్ష, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక నవంబర్ 10 తో నామినేషన్లు వేసే ప్రక్రియ మగియనుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో.. ఇప్పటివరకు నామినేషన్లు వేయని అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఈరోజు కీలక నేతలైన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నామినేషన్లు వేయనున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజే ఆయన ఈ రెండు చోట్ల నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 -12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ సమర్పించనున్నారు. అనంతరం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు కామరెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు.
Also Read: ఐటీ దిగ్బంధంలో పొంగులేటి.. నామినేషన్ వేస్తారా.. లేదా..?
ఇక ఉదయం 11.45 గంటలకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సైతం ఈరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమైపోయారు. ఉదయం సిద్దిపేటలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఈటల రాజేందర్ కూడా ఈరోజే నామినేషన్ వేయనున్నారు. కేసీఆర్‌కు పోటీగా ఈటల గజ్వేల్‌లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో నామివేషన్ వేసిన ఈటల ఈరోజు హుజురాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్ ఇప్పటికే రెండు స్థానాల్లో నామినేషన్ వేసారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం భారీ ర్యాలీ నడుమ కొండగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌కు పోటీగా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన నవంబర్ 10న నామినేషన్ వేయనున్నారు. ఇక ఆరోజే కామారెడ్డిలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రానున్నారు.
Also read: విద్యార్థితో సెక్స్ ఎఫైర్ పెట్టుకున్న టీచర్.. గంజాయి, మద్యం తాగించిమరీ