Bandi Sanjay: కేసీఆర్‌ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత హామీలను నెరవేర్చలేని సీఎం.. మళ్లీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్ధమయ్యరని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. బీజేపీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

New Update
Bandi Sanjay: కేసీఆర్‌ ఓ తాగుబోతు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌ ఓ పెద్ద తాగుబోతుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ తన పార్టీకి తానే మంట పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకొని పేదల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు దీనిని గమనించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్‌ కోరారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవితను బండి సంజయ్‌ శూర్పణఖతో పోల్చారు. మంత్రి కేటీఆర్‌ తాగుడు, పీకుడు, పెకుడుకే పనికొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేయబోతున్నారన్న బండి సంజయ్‌.. కేసీఆర్‌ రాష్ట్రానికి ఏం చేశారని ఓట్లు అడగడానికి సిద్ధమయ్యారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఓట్లకోసం వచ్చిన కేసీఆర్‌ను గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు కొత్త వేషాలతో ప్రజల వద్దకు రాబోతున్నారని మండిపడ్డారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీనే లేదని విమర్శించారు. కొన్ని పత్రికలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నాయన్నారు. రాహుల్‌ గాంధీకి ఇండియా ఫుల్‌ఫార్మ్‌ కూడా తెలియదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో రామరాజ్యం రాబోతోందని బండి సంజయ్‌ తెలిపారు. కేసీఆర్‌ ఎన్ని ఎత్తుగడలు వేసినా రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేరని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని బండి సంజయ్‌ తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు