KCR: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు!

మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మాజీ సీఎం కేసీఆర్‌తో సీఎం జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

New Update
KCR: వారికి టికెట్ వద్దు.. జగన్ కు మాజీ సీఎం కేసీఆర్ సలహాలు!

CM Jagan Meets KCR: జూబ్లీహిల్స్ నందినగర్‌ లో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను గురువారం ఏపీ సీఎం జగన్ (CM Jagan)) పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికల (AP Elections) నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సీఎం జగన్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ఏం సంభాషణ జరిగిందనే చర్చ అందరిలో మొదలైంది. సీఎం జగన్ కు, కేసీఆర్ కు రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ ను సీఎం జగన్ కలవడం ఇది తొలిసారి. అయితే రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన సీఎం జగన్ కు కేసీఆర్ సూచనలు చేసినట్లు సమాచారం.

ALSO READ: YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ?

ఇలా చేస్తే గెలవచ్చు...

మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ కు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఇరువురి మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. భూ కబ్జా ఆరోపణలు ఉన్నోళ్లకు టికెట్లు ఇవ్వొద్దని కేసీఆర్ సీఎం జగన్ కు సూచనలు చేశారట. కాల్ మనీ ఇతర ఇల్లీగల్ బిజినెస్ చేసేవారిని దూరం పెట్టాలని.. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లను, ప్రజల ఆదరణ లేనోళ్లను దూరం పెట్టాలని అన్నారట. గెలుపు గుర్రాలకు ప్రాధాన్యం ఇచ్చినా... సామాజిక సమీకరణలు పాటించాలని సూచనలు చేశారు. అభ్యర్థులకన్నా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమంటూ జగన్‌కు కేసీఆర్ సలహా ఇచ్చారట.

థర్డ్ లిస్ట్ కోసం ఉత్కంఠ..

మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన సీఎం జగన్ మూడో లిస్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుబట్టారు. అధికారంలో కోల్పోవద్దనే ఆలోచనలో గెలవని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల మొదటి లిస్ట్, రెండో లిస్టును వైసీపీ విడుదల చేసింది. నియోజకవర్గ అభ్యర్థుల మార్పులు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మూడో లిస్ట్ పై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం.

AP Elections: వైసీపీ థర్డ్ లిస్ట్.. టెన్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు!

Advertisment
తాజా కథనాలు