BRS Lok Sabha Candidates : తెలంగాణ(Telangana) లో ప్రతిపక్ష పార్టీగా మారిన బీఆర్ఎస్(BRS) ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) మీద దృష్టి పెట్టింది. మరో రెండు నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతుండడంతో అభ్యర్ధుల ఎంపిక మీద ఫోకస్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). ఇంతకు ముందులా కాకుండా ఒక కొత్త వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళాలని కేసీఆర్ బావిస్తున్నారు. అందుకే అభ్యర్ధుల ఎంపికలో కూడా కొత్త స్ట్రీటజీతో వస్తున్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగా పలుచోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే యోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల కోసం టికెట్లు ఆశిస్తున్న వారి పేర్లను తీసుకుని కేసీఆర్ వారి మీద రహస్య సర్వేలు చేయిస్తున్నారని తెలుస్తోంది. దాన్ని బట్టి అభ్యర్ధులను నిర్ణయించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. దాంతో పాటూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తరువాతే తమ అభ్యర్ధుల లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Also Read : Hyderabad : హైదరాబాద్‌లో మత్తు చాక్లెట్లు… విద్యార్ధులు, యువతే టార్గెట్
ఖమ్మం నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో...
ఖమ్మం పార్లమెంట్(Khammam Parliament) నుంచి పోటీకి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ దృష్టిలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరువురి బలాబలగాలు, సామాజికఅంశాలపై అంతర్గత సర్వేలు చేయిస్తున్నారని...దాన్ని బట్టి ఒకరి పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో నియోజకవర్గాల వారిగా అభిప్రాయ సేకరణ, అనంతరం అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
12 సీట్లు గెలుపే లక్ష్యంగా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ(BJP) తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ఈసారి 10-12 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే గత రెండు వారాలుగా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ నాయకత్వం. అలాగే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దింపిన విధంగానే మొత్తం 17 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. 17 సీట్లలో ఇప్పటివరకూ 3-4 సీట్లకు మాత్రమే టిక్కెట్లు కన్ఫర్మ్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, చేవెళ్ల నుంచి జీ రంజిత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కరీంనగర్ నుంచి ఓడిపోయిన మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్‌లు(B. Vinod Kumar) తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.
Also Read : Salem : రెండు లారీల మధ్య భార్యభర్తలు నుజ్జునుజ్జు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!