KCR: చవటలు..దద్దమ్మలు..కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పథకాల్లో ఘోరంగా విఫలమైందంటూ నిప్పులు చెరిగారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పకపోతే వాళ్లలో నిర్లక్ష్యం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు.

KCR: చవటలు..దద్దమ్మలు..కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..!
New Update

KCR Comments On CM Revanth Reddy:  బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీనంగర్ కదనభేటీ సభలో కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. ఈ లోకసభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) కాంగ్రెస్ కు బుద్ధి చెప్పకుంటే వారిలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే..బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రజల పక్షాన అంత బలంగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో మంచి నీళ్లు, కరెంటు సమస్యలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఎంతో శ్రమించి ఇంటింటికి మంచినీళ్లు అందిస్తే...ఇప్పుడు ప్రభుత్వానికి ఆ పథకాన్ని నడిపించే తెలివిలేదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో ఎందుకు సమస్యలు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. సీఎం అయిన ఏడాదిలోపే రాష్ట్రంలో కరెంటు సమస్యలను చక్కదిద్దాం. రెప్పపాటు కరెంటు పోకుండా అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చాం. 24గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంటు ను అందించాం. రైతు బంధును కరోనా వచ్చినా ఆపలేదు. ఈరోజు ఆ రైతు బంధును వేయడం కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పక్కకు పోగానే కరెంట్ బంద్ చేశారు. మేం 9ఏండ్లు ఇచ్చాం..మరి ఈ చవట దద్దమ్మలకు ఎందుకు ఇయ్యడం రావడం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్!

#kcr #congress #cm-revanth-reddy #lok-sabha-elections-2024 #karimnagar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe