తెలంగాణ అధికా పార్టీ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోయింది. ప్రచారంతో ఓటర్లకు గేలం వేయడానికి అన్ని కసరత్తలు చేసేసుకుని రంగంలో దూకేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేయాలని డిసైడ్ అయిపోయిఆరు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ తో కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
హూస్నాబాద్ లో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి హరీష్ రావ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత అక్టోబర్ 16న జనగామ, భువనగిరి సభలకు....17న సిరిసిల్ల, సద్ధిపేట సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు 18న జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు ఉంటాయి. దీని తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు కేసీఆర్. మళ్ళీ అక్టోబర్ 26నుంచి వరుసగా సభల్లో పాల్గొంటారు. 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడు...27న పాలేరు, స్టేషన్ ఘన్ పూర్, 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు...30న జుక్కల్,బాన్సువాడ, నారాయణ ఖేడ్, 31న హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకొండల్లో సభలు ఉంటాయి.
ఇక నవంబర్ లో 1న సత్తుపల్లి, ఇల్లెందు...2న నిర్మల్, బాల్కొండ,ధర్మపురి...3న భైంసా, ఆర్మూర్, కోరుట్ల....5న కొత్తగూడెం, ఖమ్మం....6న గద్వాల్, మఖ్తల్, నారాయణ పేట...7న చెన్నూరు,మంథని, పెద్దపల్లి....8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిల్లో ప్రజలను కలుస్తారు.
నవంబర్ తొమ్మిన సీఎం కేసీఆర్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్ధిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 2గంటలకు గజ్వేల్‌లో మొదటి నామినేషన్ ను వేసి అక్కడ నుంచి కామారెడ్డి వెళ్ళి అక్కడ కూడా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డి భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు.