కవిత ఢిల్లీ టూర్... షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ....!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

author-image
By G Ramu
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ ఫేక్‌ సర్వేలు.. ఎమ్మెల్సీ కవిత
New Update

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు జాతీయ స్థాయి నేతలతో కలిసి ఆమె వేదికను పంచుకున్నారు. ఈ సందర్బంగా నిధి శర్మ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. స్వ రాష్ట్ర స్వప్పం సాకారమవుతుందని తాము అనుకోలేదన్నారు. తన తండి సీఎం అవుతారని తాము ముందు ఊహించలేదన్నారు.

కఠినమైన మార్గంలో ఎన్నో కష్టాలను అధిగమించి ప్రస్తుతం తాను ఈ స్థానానికి చేరుకున్నానని వెల్లడించారు. ప్రతి రంగంలోనూ మహిళలకు పరిమితులు వుండటం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి కొందరి కోసం వున్నవి కాదన్నారు. అవి మన అందరి కోసం వున్నాయని చెప్పారు. రాజకీయాలు అంటే సమయాన్ని వృథా చేయడమని అంతా అనుకుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు.

‘షీ ద లీడర్’అనే పుస్తకంలో మొత్తం 17 మంది ప్రముఖ మహిళా రాజకీయ నేతల వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. సామాజిక సమానత్వం, మహిళా అభ్యున్నతితో పాటు ఇతర రంగాల్లో విశేషంగా కృషి చేసిన ప్రముఖ నేతల వివరాలను ఇందులో రాశారు. పుస్తకంలో ప్రముఖ మహిళా నేతలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ సీఎం సుచేత కృపాలని గురించి పుస్తకంలో రాశారు.

వారితో పాటు తమిళనాడు మాజీ సీఎం జయలలిత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సిందియా , ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్, యూపీ మాజీ సీఎం మాయావతి, ప్రతిభా పాటిల్, సుష్మా స్వరాజ్ ,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బృందాకరత్ ,అంబికా సోనీ ,స్మృతి ఇరానీ, సుప్రియ సులే , కనిమొళిల జీవిత విశేషాలను పుస్తకంలో ప్రస్తావించారు.

#brs #mlc-kavitha #sonia-gandhi #jayalalitha #mamatha-benarjee #mayavathi #she-the-leader #nidhi-sharma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe