Telangana: కవిత రాకతో బీఆర్‌ఎస్‌కు బిగ్ రిలీఫ్‌.. కేసీఆర్‌ నెక్స్ట్‌ ప్లాన్ అదేనా !

కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్‌ పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్టీకి సవాలుగా మారనుంది. దీంతో ఈ ఎన్నికలపై కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana: కవిత రాకతో బీఆర్‌ఎస్‌కు బిగ్ రిలీఫ్‌.. కేసీఆర్‌ నెక్స్ట్‌ ప్లాన్ అదేనా !
New Update

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాక బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్‌) పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌కే రాష్ట్ర ప్రజలకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో కూడా బీఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. గ్రామీణ స్థాయిలో కూడా బీఆర్ఎస్‌ పూర్తిగా విస్తరించింది. అయితే 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు కావడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ మూడోసారి కూడా బీఆర్ఎస్‌ అధికారంలోకే వస్తుందని చాలామంది భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని దక్కించుకుంది. దీంతో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది.

ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారు. కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడంతో ఆ పార్టీకి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. దీంతో బీఆర్ఎస్‌ ప్రభావం రాజకీయంగా చాలావరకు తగ్గిపోయింది. అలాగే పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యాయి. పలువురు కీలక కే. కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి వంటి బడా నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓటమి తర్వాత కేసీఆర్‌కు కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించకపోవడం, యాక్టివ్ రాజకీయాలకు కూడా దూరమవ్వడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆ పార్టీ గ్రాఫ్‌ మరింత పడిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులు బయటపెట్టడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.

Also Read: అన్నయ్యకు రాఖీ కట్టిన కవిత.. వీడియో వైరల్

ఓవైపు కవిత లిక్కర్ కేసులో అరెస్టవ్వడం, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయిన్పపటికీ.. పార్టీలో కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావులు కాంగ్రెస్‌ పాలనపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీల అమలు, రుణమాఫీ అందరికీ అమలు కాకపోవడం లాంటి ప్రజల సమస్యను దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా కవిత కూడా లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో బీఆర్ఎస్‌ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఇప్పటికీవరకు ఆ పార్టీలో ఎలాంటి సందడి వాతావరణం లేదు. ఇప్పుడు కవిత రాకతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

కవిత కూడా జైలు నుంటి విడుదలయ్యాక తాను మొండిదాన్నని.. జైలుకు పంపించి జగమొండిని చేశారంటూ వ్యాఖ్యానించారు. అలాగే తనను ఇబ్బంది పెట్టినవారికి వడ్డితో సహా చెల్లిస్తానని అనడం.. ఇకనుంచి రాజకీయాల్లో మరింత బలంగా పనిచేస్తామని చెప్పడం ఆ పార్టీకి మరింత ఊపునిచ్చింది. అయితే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు ఓ సవాలుగా మారనుంది. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ కంటే.. బీఆర్‌ఎస్‌కే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ ప్రభావం తగ్గిపోయింది. మరి పంచాయతీ ఎన్నికల్లో తమ పట్టును నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: కడిగిన ముత్యంలా బయటకొస్తా.. నాన్న నాయకత్వంలో పోరాడుతా: కవిత

కవిత జైలు నుంచి విడుదల కావడంతో ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ.. సరైన వ్యూహాలు రచించి బీఆర్‌ఎస్‌ పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే.. ఆ పార్టీ పునర్వైభవానికి మళ్లీ బీజం పడుతుంది. ఒకవేళ ఈసారి కూడా ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపించలేకపోతే.. మళ్లీ పార్టీ గాడిన పడేందుకు చాలా సమయం పడుతుంది. అధికారం కోల్పోయినప్పటికీ క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ క్యేడర్ బలంగానే ఉంది. గతంలో 33 జడ్పీ ఛైర్మన్‌ స్థానాలను కైవశం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కవిత కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలోకి దిగుతుంది. దీంతో కవిత వల్ల కూడా బీఆర్ఎస్‌కు అనుకూల పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధరణంగా జైలు నుంచి బయటికి వచ్చిన నాయకులకు ప్రజల్లో విశేష ఆదరణ దక్కుతుంది. సీఎం రేవంత్, మాజీ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి వారు కూడా జైలు నుంచి బయటికి వచ్చి ప్రజల్లో మరింత గుర్తింపు తెచ్చుకున్నవారే. అయితే పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం చూపించినట్లైతే పార్టీలో మరింత ఉత్సాహం నెలకొంటుంది. రాష్ట్రంలో మరోసారి తమ ఉనికిని విస్తరించేందుకు ఈ విజయం దోహదపడుతుంది.

#kcr #telugu-news #telangana-news #kavita
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe