ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేదాన్ని.. కత్రినా కైఫ్‌

స్టార్ నటి కత్రినా కైఫ్ అప్ కమింగ్ మూవీ ‘మెరీ క్రిస్మస్‌’లో చాలా సాహసాలు చేశానని చెప్పింది. ఈ మూవీలో బైక్ డ్రైవింగ్ సీన్ కోసం స్పెయిన్‌లోని డుకాటీ ట్రైనింగ్‌ స్కూల్‌ వెళ్లి నేర్చుకున్నానని, ఆ తర్వాత అర్ధరాత్రి పూట ఇంటి దగ్గరలో ఒంటరిగా బైక్ వేసుకుని రోడ్లపై తిరిగినట్లు తెలిపింది.

New Update
ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేదాన్ని.. కత్రినా కైఫ్‌

Bollywood Actress : బాలీవుడ్(Bollywood) నటి కత్రినా కైఫ్(Katrina Kaif) తన అప్ కమింగ్ మూవీ ‘మెరీ క్రిస్మస్‌’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2024 జనవరి 12న విడుదల కాబోతున్న మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్న నటి తాజా ఇంటర్వ్యూలో మూవీకి సంబంధించి పలు సీక్రెట్స్ వెల్లడించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.

ఈ మేరకు కత్రిన మాట్లాడుతూ.. '‘మెరీ క్రిస్మస్‌’లో చాలా సాహసాలు చేశాను. ఈ సినిమా కోసం రోడ్‌ ట్రిప్‌లు వేశాను. ముఖ్యంగా మోటార్‌సైకిల్‌ రైడింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ మూవీ చేస్తున్నపుడు బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కొన్నిసార్లు అర్థరాత్రి బైక్ వేసుకుని రోడ్లపైకి వచ్చేదాన్ని. మొదట్లో బండి నడపే స్కిల్స్ నేర్పడంకోసం స్పెయిన్‌లోని డుకాటీ ట్రైనింగ్‌ స్కూల్‌కి పంపారు. అక్కడ ట్రైనింగ్ అయిపోగానే బాంద్రాలోని మా ఇంటి నుంచి యశ్‌రాజ్‌ స్టూడియోస్‌ వరకు రైడింగ్‌కు వెళ్లేదాన్ని. ఆ సమయంలో కూడా ట్రాఫిక్‌ కారణంగా నడపడం కష్టమయ్యేది. క్రమంగా ఫర్ ఫెక్ట్ అయ్యాను. నాకు బండి నేర్పించేందుకు ఒక వ్యక్తి వెంట ఎప్పుడూ ఉండేవారు. అతడు ఎవరన్నది మాత్రం రహస్యం. ‘టైగర్‌ 3’లో జోయాగా భారీ పోరాటాలు చేసినా నేను.. ఇందులోనూ అలాంటి సన్నీవేశాలతో అభిమానులను మెప్పిస్తాను. యాక్షన్‌పరంగా ఎంతో రిస్కు తీసుకున్నా. ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టంగా అనిపించినా వెనక్కి తగ్గలేదు. ఇందులో నేను చేసిన పాత్ర నన్ను నాకే కొత్తగా చూపించింది' అంటూ చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి  : MMTS TRAINS CANCELLED: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే!

అలాగే ‘వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలో నటించాలనే నా డ్రీమ్ దీంతో నెరవేరింది. డైరెక్టర్ శ్రీరామ్‌ రాఘవన్‌తోనూ సినిమా చేయాలనే కోరిక తీరిందని చెప్పింది. అలాగే సహనటుడు విజయ్‌ సేతుపతి నటన అద్భుతంగా ఉంటుందని, ఆయనలో చాలా కోణాలున్నాయంటూ పొగిడేసింది. ఇక శ్రీరాం రాఘవన్‌ తెరకెక్కించిన ఈ మూవీ హిందీ, తమిళ భాషల్లో విడుదలకానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు