Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. శ్రీమహావిష్ణువు, శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. By Shiva.K 14 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Karthika Masam 2023: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం(Karthika Masam) ప్రారంభమైంది. శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు భక్తులు. శివాలయాలు, వైష్ణవ క్షేత్రాల్లో దీపారాధన చేస్తూ శివుడికి, శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడల, తిరుపతి, విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాస పూజలు చేస్తున్నారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అవసరమైన భద్రతాపరమైన చర్యలతో పాటు.. భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతున్నాడు. అలాగే, రద్దీ దృష్ట్యా ఆలయాల్లో రోజూ చేసే కొన్ని పూజా కార్యక్రమాలకు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. శ్రీశైలం పుణ్య క్షేత్రంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం, సామూహిక అభిషేకాలను రద్దీ రోజుల్లో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్ది రాజు తెలిపారు. అలాగే, శనివారం, ఆదివారం, సోమవారాలతో పాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామి వారి ఆలయానికి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఇలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి.. కార్తీక పౌర్ణమి నవంబర్ 27న ఉన్నప్పటికీ కూడా ఆరోజు పౌర్ణమి ఘడియలు మధ్యాహ్నం వరకే ఉన్నాయి. అందుకే ముందురోజే 26 వ తేదీనే (రెండవ ఆదివారం నాడే) ప్రదోష కాలంలో పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగానే శ్రీశైలంలో 26వ తేదీన సాయంత్రమే కృష్ణవేణీ నదీమాతల్లికి పుణ్య నదీ హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమ నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు.. నవంబరు 14 మంగళవారం -కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి నవంబరు 15 బుధవారం - యమవిదియ - భగినీహస్త భోజనం నవంబరు 17 శుక్రవారం- నాగుల చవితి నవంబరు 20- కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి నవంబరు 22- యాజ్ఞవల్క జయంతి నవంబరు 23- మతత్రయ ఏకాదశి నవంబరు 24 శుక్రవారం- క్షీరాబ్ది ద్వాదశి నవంబరు 26 ఆదివారం- జ్వాలా తోరణం నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ. డిసెంబరు 04 -కార్తీకమాసం మూడో సోమవారం డిసెంబరు 11- కార్తీకమాసం నాలుగో సోమవారం డిసెంబరు 13 బుధవారం- పోలి స్వర్గం Also Read: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే! మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!! #devotees #temples #karthika-masam #karthika-masam-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి