Crime News : సెల్‌ఫోన్‌ను మింగిన ఖైదీ.. చివరికి

కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్‌ఫోన్‌నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు.

New Update
Crime News : సెల్‌ఫోన్‌ను మింగిన ఖైదీ.. చివరికి

Swallows Mobile Phone : కర్ణాటక(Karnataka) లోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుంది. అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న పరశురామ్ అనే ఖైదీ(Prisoner) ఏకంగా సెల్‌ఫోన్‌నే మింగేయడం కలకలం రేపింది. తనకు కడుపు నొప్పి(Stomach Ache) ఉందని గత నెల రోజులుగా జైలు అధికారులకు చెప్పగా.. చివరికి స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరుశురామ్‌ కడుపు భాగంలో ఎక్స్ రే తీసినప్పటికీ.. పొట్ట లోపల ఏముందో వైద్యులకు క్లారిటీగా కనిపించలేదు. అలాగే ఆసుపత్రిలో ఎండోస్కోపీ సదుపాయం కూడా లేకపోవడంతో అతడిని గత నెల ఒకటవ తేదీన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

Also Read: బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి

ఆ కారాగారంలోని ఆసుపత్రిలో 6వ తేదీ వరకు చికిత్స అందించారు. ఆ తర్వాత విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చివరికి ఏప్రిల్ 25వ తేదీన శస్త్రచికిత్స చేసి.. అతడి కడుపులో ఉన్న సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతడి పరుశురామ్ పరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నట్లు జైలు అధికారులు చెప్పారు. అయితే అతడు సెల్‌ఫోన్‌(Cell Phone) ఎప్పుడు మింగాడో అనేది గుర్తించాల్సి ఉందని శివమొగ్గ జైలు అధికారులు శుక్రవారం చెప్పారు.

Also Read: 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది: పాకిస్థాన్‌ మాజీ సెనేటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు