Covid Positive Cases : దేశంలో నెమ్మదిగా కరోనా(Corona) కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఒకరిద్దరు చనిపోతున్నారు కూడా. దేశవ్యాప్తంగా మంగళవారం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరింది. కొత్త కేసుల్లో 69.. JN.1 వేరియంట్ కేసులు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 6 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ పాటించాల్సిందే అంటూ ఆర్డర్లు పాస్ చేసింది. COVID-19 పాజిటివ్ రోగులకు ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈ ఏడు రోజులూ సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చికిత్స అవసరమైతేనే ఆస్పత్రుల్లో చేరాలని సూచించింది. రోగుల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తగిన వైద్య సహాయం అందిస్తారని తెలిపింది. సీనియర్ సిటిజన్లు, చిన్నారులు, గర్భిణులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.
Also Read:అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి
నిన్న కర్ణాటక(Karnataka) లో 74 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క బెంగళూరు(Bangalore) లోనే 57 కేసులు ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు కూడా. అందుకే కోవిడ్ సోకిన వారు ఐసోలేషన్ లో తప్పనిసరిగా ఉండాలని కర్ణాటక వైద్యాధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటూ రాష్ట్ర వ్యాప్తంగా 5వేల కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను వైద్య సిబ్బంది సందర్శించి అవసరమైన చికిత్స, ఔషధాలు అందిస్తారు. యూపీహెచ్‌సీలు, నమ్మ క్లినిక్‌ల నుంచి వైద్య సిబ్బంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగుల వద్దకు, సాధారణ కోవిడ్ వార్డులలో అడ్మిట్ అయిన వారి వద్దకు వస్తారని కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read : డిసెంబర్‌లోనే కొత్త వేరియంట్లు ఎందుకు వ్యాప్తి చెందుతాయి? కరోనాతో ఈ నెలకు ఉన్న బంధమేంటి?