South India: ప్రత్యేక సౌత్ ఇండియా దేశం కావాలి.. కాంగ్రెస్ ఎంపీ డిమాండ్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ అన్నారు. దక్షిణ భారత్‌కు రావాల్సిన నిధులు ఉత్తరానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇది ఇలానే కొనసాగితే ప్రత్యేక సౌత్ ఇండియా డిమాండ్ ముందుకొస్తుందని అన్నారు.

New Update
South India: ప్రత్యేక సౌత్ ఇండియా దేశం కావాలి.. కాంగ్రెస్ ఎంపీ డిమాండ్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (గురువారం) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కేంద్రం నుంచి కర్ణాటకకు రావాల్సిన నిధులు కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. దక్షిణ భారతదేశానికి రావాల్సిన నిధులను ఉత్తరం వైపుకు మళ్లిస్తున్నారని అన్నారు. ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే దక్షిణ భారత్ ప్రజలు.. ప్రత్యేక దక్షిణ భారతదేశం కావాలని డిమాండ్ చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక దేశం డిమాండ్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు.

ఇదే కాంగ్రెస్ స్వభావం 

ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. సురేష్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి విభజించు..పాలించు అనమే స్వభావం ఉందంటూ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో NDA ప్రభుత్వంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ ఎలా పెరిగిందో తెలిపే డేటాను తేజస్వీ సూర్య షేర్‌ చేశారు.

ఇది చాలా ఘోరం 

ఒకవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశాన్ని ఏకం చేయడానికి అని చెబుతూ పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు మాత్రం దేశాన్ని విభజించేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. విభజించు.. పాలించు విధానం అనేది కాంగ్రెస్ స్వభావమే. ఇది వలసవాదులు అనుసరించిన దానికంటే చాల ఘోరమైనదంటూ తేజస్వీ సూర్య పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు