Karimnagar: పందెం కోడి వేలానికి ముందు బిగ్ ట్విస్ట్.. కోడి నాదే అంటున్న మహేష్ మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పందెం కోడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ రోజు కోడి వేలంపాట మొదలుపెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ అధికారులకు నెల్లూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కోడి తనదేనని ఆధారాలతో ముందుకొచ్చాడు. By srinivas 12 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Karimnagar: కరీంనగర్-సిరిసిల్ల బస్ (Karimnagar-Siricilla) లో దొరికిన పందెం కోడి (padem kodi) వ్వవహారం గత మూడురోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు కోడి వేలంపాట మొదలుపెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ అధికారులకు ఓ వ్యక్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ కోడి తనదేనంటూ పలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చాడు. Your browser does not support the video tag. కోడి నాదే.. ఈ మేరకు ఏపిలోని నెల్లూరు (Nellore) జిల్లాకు చెందిన వల్లపు మహేష్ (Mahesh) ఈ కోడి తనదేనని చెప్పాడు. కొంతకాలంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో మేస్త్రీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నానని, అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊరికి వెళ్లే క్రమంలో బస్సులో కోడిని మరిచిపోయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో పలు ఆధారాలతో వీడియో, ఫొటో, ఆధార్ కార్డు పోస్ట్ చేశాడు. 'నిద్రమత్తులో ఉండటం వల్ల నా లగేజీమొత్తం తీసుకుని బస్సు దిగినప్పటికీ కోడి సంచిని మాత్రం అక్కడే వదిలేశా. ఆ కోడికి టికెట్ కూడా తీసుకున్నాను. దయచేసి ఆ కోడిని వేలం వేయొద్దు. నా దగ్గర ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయి' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : ABD: భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే: ఏబీ డివిలియర్స్ ఈ రోజు వేలం.. ఇక రెండు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్ మల్లయ్య తెలిపారు. వేలం ఆపేదే లేదు.. పందెం కోడి కోసం నిన్నటి వరకు ఎవరూ రాకపోవ డంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు మేనేజర్ మల్లయ్య. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు మహేందర్ ఓ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. దయచేసి పందెంకోడి వేలం ఆపాలని ఆర్టీసీ అధికారు లను బాధితుడు వేడుకుం టున్నాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం పందెంకోడి వేలన్ని ఆపేదే లేదని కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో మేనేజర్ చెబుతున్నారు. అవసరమైతే కోడి బాధితుడు కూడా వేలంపాటలో పాల్గొనాలని ఆర్టీసీ అధికారులు సమాధానం చెబుతుండటం చర్చనీయాంశమైంది. #nellore #warangal #karimnagar #pandem-kodi #siricilla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి