ప్రతీ పథకంలో కేంద్ర నిధులే ఉన్నాయని కరీంనగర్ ప్రెస్ మీట్ బండి సంజయ్ తెలిపారు. నిధులు కేంద్రానివి.. సోకులు రాష్ట్రానివి.. అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనేది కేంద్రం. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్రం అబద్దాలు చెబుతున్నదని రైతులు ఈ విషయం గుర్తించారని బండి పేర్కొన్నారు. ఉపాధి హామీ డబ్బులు కూడా మావేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. పంటలు నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. పచ్చి బూతు పేపర్ నమస్తే తెలంగాణ. నేను బీఆర్ఎస్‌కు ఓటేయమని చెప్పానట. ఫస్ట్ తారీకు నాడు జీతాలిస్తే ఓటేయమన్న.. మరి ఇస్తున్నారా..? ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తే ఆ పార్టీకి ఓటేయమన్న. ఎందుకు ఇవన్నీ రాయలేదు..? అని ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేస్తున్నది, చేసేది బీజేపీనే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, వేధింపులు భరించలేక అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. మీ మెనిఫెస్టోతో దిమ్మ తిరుగుతుందని చెప్పుకోవడం జోక్.. యువతను డ్రగ్స్, గంజాయికి అలవాటు చేసారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అవినీతి అరాచకాలు, కబ్జాలు చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే. నిజాయతీతో, నిష్పక్షపాతంగా ఎన్నికల అధికారులు వ్యవహరించాలని బండి సంజయ్ కోరారు. సామాన్యులు సొంత అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బులను సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. పదవీకాలం పొడగించి సీఎం పేచీలో ఉన్న అధికారులను, ఇంటెలిజెన్స్ అధికారులను బదిలీ చేయాలని బండి డిమాండ్ చేశారు. దీనిపై మేము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా..
కేటీఆర్ అహంకారంతో సిరిసిల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పడం లేదు..? అని ప్రశ్నించారు. తల్లి,చెల్లి పూజలు చేస్తుంటే.. కేటీఆర్ ఎందుకు పూజించడు..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని నాకున్న తపన కూడా కేటీఆర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బాగుండాలి.. మేము రాజకీయంగా కొట్లాడుతాం..!! కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుంది. రీంనగర్‌లో పోటీ చేయాలనుందని నా కోరిక చెప్పాను. మా అధిష్టానం ఆదేశిస్తే చేస్తా అని బండి తెలిపారు. హైదరాబాద్ దాటి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదన్నది చెప్పాల అంటూ ప్రశ్నించారు. జనసేనతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది. మాకున్న సమాచారం ప్రకారం మేము ఒంటరిగానే వెళ్తాం.ఎంఐఎం అడ్డాగా చెప్పుకునే భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు అన్ని పార్టీలను రప్పించిన ఘనత మాదన్నారు. చివరకు ఎంఐఎం నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం పేరు కలవరిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా?