USA: 231 మిలియన్ డాలర్ల విరాళాలు..దూసుకుపోతున్న కమలా హారిస్

అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్క ఆగస్ట్ నెలలోనే 231 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. ట్రంప్ కంటే ఎక్కువ విరాళాలు సేకరించి తన ఆధిక్యతను చాటుకుంటున్నారు.

USA: 231 మిలియన్ డాలర్ల విరాళాలు..దూసుకుపోతున్న కమలా హారిస్
New Update

Kamala Harris: అమెరికాలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్ధులు ఒకరిని మించి ఒకరు ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్‌కు గట్టి పోటీని ఇస్తున్నారు. మలా ఎక్కడకు వెళ్ళినా భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమెకు భారీ ఎత్తున విరాళాలు కూడా వస్తున్నాయి. ఆగస్టు నెలలో ట్రం కంటే కమా హారిస్‌కే ఎక్కువ విరాళాలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 30 లక్షల మంది దాతల నుంచి 231 మిలియన్ డాలర్ల విరాళాలు వచ్చాయని తెలుస్తోంది. మరోవైపు ట్రంప్‌కు మాత్రం 13 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని ఆయన బృందం తెలిపింది.

కమలా హారిస్ చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు నెలలే మిగిలి ఉండడంతో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్‌ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దీని కోసం మొత్తంగా 1 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ క్రమంలో ప్రకటనలు, ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికయ్యే ఖర్చుల కోసం రెండు పార్టీలు నిధులను సేకరిస్తున్నాయి.

Also Read: Haryana: ఎటూ తేలని సీట్ల పంపకం..ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం!

#elections #donald-trump #usa #america #kamala-harris
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe