Kamal Nath : నేను పార్టీని వీడుతున్నట్లు ఎక్కడైనా మాట్లాడానా..? : కమల్‌ నాథ్‌!

గత రెండు రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ నేత , మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తోసిపుచ్చారు. పార్టీ మారుతున్నట్లు ఎక్కడా కూడా నేను ఎవరితోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు.

New Update
Kamal Nath : నేను పార్టీని వీడుతున్నట్లు ఎక్కడైనా మాట్లాడానా..? : కమల్‌ నాథ్‌!

Kamal Nath Denied : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌(Congress) సీనియర్‌ నేత కమల్‌నాథ్‌(Kamal Nath) తో పాటు ఆయన కుమారుడు నకుల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ(BJP) లో చేరడంపై గత రెండు రోజులుగా చర్చలు జోరందుకున్నాయి. ఆదివారం కమల్‌నాథ్‌ తన కుమారుడితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తారని ప్రచారం జరిగింది.

ఇప్పటి వరకు ఈ ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి కానీ ఇంతలో స్వయంగా కమల్ నాథ్ ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు. నేను ఎక్కడైనా పార్టీని వీడుతున్నట్లు మాట్లాడానా అంటూ ప్రశ్నించారు. గతంలో కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. ఇంతలో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ కమల్‌నాథ్‌కు సంబంధించి జరుగుతున్న చర్చలకు మీడియా అత్యుత్సాహమే కారణమని ఆరోపించారు.

నేను కమల్‌నాథ్‌తో మాట్లాడానని, మీడియాలో వస్తున్నవి అన్ని ఊహాగానాలు అని పట్వారీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలనే దానిపైనే అనుభవజ్ఞుడి దృష్టి ఉందని, బీజేపీలో చేరే సమస్య లేదని సజ్జన్ సింగ్ వర్మ ఆదివారం అన్నారు. కమల్‌నాథ్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన వర్మ.. కమల్‌నాథ్‌ తన ఇంట్లో చార్ట్‌ పెట్టుకుని కూర్చున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లపై కుల సమీకరణలపై దృష్టి సారిస్తానని వర్మ చెప్పారని అన్నారు.

శనివారం నాడు కమల్‌ నాథ్‌ పార్టీ మారడం గురించి మీడియా ప్రశ్నిస్తే కనీసం ఆయన వాటిని ఖండించలేదని వర్మ వివరించారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నానని, మా మధ్య కుటుంబ సంబంధాలు ఉన్నాయని, రాజకీయ సమీకరణాలు కాదని ఆయన అన్నారు" అని అన్నారే తప్పా ఆయన పార్టీ మారే సంగతి గురించి ప్రస్తావించలేదని తెలిపారు.

Also Read : ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు