Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) సోమవారం ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈడీ కేజ్రీవాల్ కు ఆరోసారి సమన్లు పంపి విచారణకు రావాల్సిందిగా తెలిపింది. అయితే ఈసారి కూడా కేజ్రీవాల్ ఈడీ ముందుకు వస్తారో రారో చెప్పలేదు. కానీ బీజేపీ మీద మాత్రం విరుచుకుపడ్డారు. ఇప్పటికిప్పుడు ఈడీ తన దర్యాప్తును నిలిపివేస్తే .. సగం మంది బీజేపీ నేతలు పార్టీని వీడిపోతారని కేజ్రీవాల్ అన్నారు.
పూర్తిగా చదవండి..kejriwal: ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్!
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు
Translate this News: