Kalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..!

'కల్కి 2898AD' ట్రైల‌ర్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేక‌ర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

New Update
Kalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..!

Kalki 2898AD Trailer Update : ప్రెజెంట్ టాలీవడ్ (Tollywood) లో 'కల్కి' ఫీవర్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా జూన్ 27 న పాన్ వరల్డ్ లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇటీవలే మూవీ టీమ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన బుజ్జి, భైరవ వీడియోస్ కి సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్.

జూన్ 10 ఫ్యాన్స్ కి పండగే...

'కల్కి 2898AD' (Kalki 2898AD) ట్రైల‌ర్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేక‌ర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ కటౌట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ లో మరింత జోష్ వచ్చేసింది.

Also Read : అవును.. నేను రిలేషన్ లో ఉన్నా : కృతి శెట్టి

కాగా 'కల్కి 2898AD' ట్రైలర్ ని ముంబై (Mumbai) లో భారీ ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు