Kalki 2989 AD: కల్కికి టికెట్ల రేటు పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

కల్కి సినిమా అదనపు షో లకు, టిక్కెట్ల రేటు పెంపుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌ 75, మ‌ల్టీప్లెక్స్‌లో 125 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం క‌ల్పించింది.

New Update
Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్!

Andhra Pradesh:ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీ టికెట్ల రేట్లు పెరిగాయి. తెలంగాణ‌తో పాటు ఏపీలో టికెట్ రేట్ల‌ను పెంచుకునేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు మంజూరు చేశాయి. ఈ టికెట్ ధ‌ర‌ల పెంపుపై తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే జీవోను జారీ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోను జారీ చేసింది. తెలంగాణ‌లో క‌ల్కి మూవ టికెట్ ధర సింగిల్ స్క్రీన్లకు 75, మల్టీప్లెక్స్‌లు 125రూ. వరకు పెంచుకోవచ్చని చెప్పింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధ‌ర‌లు సింగిల్ స్క్రీన్స్‌లో 100, మ‌ల్టీప్లెక్స్‌లో 75 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది.

ఈ టికెట్ల పెరుగుదలో పాటూ టాక్స్‌లను అదనంగా వసూలు చేయబోతున్నారు. ఫ‌స్ట్ వీక్ మొత్తం పెరిగిన ధ‌ర‌ల‌తోనే క‌ల్కి మూవీ స్క్రీనింగ్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జూన్ 27 నుంచి జూలై నాలుగు వ‌ర‌కు ఈ టికెట్ ధ‌ర‌లు అమ‌లులో ఉండ‌నున్నాయి.

publive-image

Also Read:Kerala: కేరళంగా మారునున్న కేరళ..అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

Advertisment
తాజా కథనాలు