Telangana : నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. By B Aravind 29 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Warangal : వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి(Kadiyam Srihari) కూతురు కడియం కావ్య(Kadiyam Kavya) తాను లోక్‌సభ బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు(శుక్రవారం) కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో చేరనున్నారు. అయితే కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కావ్యను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి, కావ్య ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. Also Read : జంపింగ్‌లపై కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ హైకమాండ్ సమక్షంలో చేరిక ఇటీవల వరంగల్ బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం కడియం కావ్యను ప్రకటించారు. అయితే ఆమె జిల్లాలో ఉన్న బీఆర్‌ఎస్ నేతల్లో సమన్వయం లేదనే కారణంతో.. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత కడియం శ్రీహరి, కావ్య హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. అయితే వరంగల్ నుంచే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి లేదా కావ్య బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నేతలు, కార్యకర్తలు గులాబీ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కే.కేశవరావు వెల్లడించారు. కేకేతో పాటు ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతానని.. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని విజయలక్ష్మీ తెలిపారు. Also Read : బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట! #telugu-news #congress #telangana-politics #kadiyam-srihari #kadiyam-kavya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి