KA Paul: నామినేషన్స్ గడువు పెంచండి.. ఈసిని డిమాండ్ చేసిన కేఏ పాల్

తెలంగాణలో నామినేషన్ల గడువును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచాలన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు కేఏ పాల్. ఈ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు.

KA Paul: సచివాలయం ఎదుట కేఏ పాల్ నిరసన
New Update

KA Paul: తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తరంగా సాగుతున్న రాజకీయాన్ని తన కామెంట్స్‌తో మరింత రక్తి కట్టిస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) పోటీ చేస్తామంటూ ముందుకొచ్చిన ఆయన.. తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు సీరియస్ ప్రతిపాదన పెట్టారు పీఎస్‌పీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణలో(Telangana) నామినేషన్ల తేదీని 12వ తేదీ వరకు పొడిగించాలని కోరారు. నామినేషన్లకు గడువు చాలా స్వల్పంగా ఉందని, ఆ గడువును పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం నాడు ప్రజాశాంతి పార్టీ ఏడుగురితో కూడిన అభ్యర్థుల రెండో జాబితాను కేఏ పాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై సంచలన కామెంట్స్ చేశారు. నామినేషన్ల గడువును 12వ తేదీ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. అభ్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాల్ ట్యాపింగ్‌ ద్వారా అభ్యర్థులను బెదిరింపులకు గురి చేసి.. కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్ కోసం రూ. 4 లక్షల కోట్ల డబ్బులను పార్క్ చేసి ఉంచారని ఆరోపించారు కేఏ పాల్.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో టికెట్ రానివాళ్లు తనతో టచ్‌లో ఉండి పీఎస్‌పీకి సపోర్ట్ చేస్తామంటున్నారని తెలిపారు కేఏ పాల్. గవర్నమెంట్ చేయని పనులు తాను చేశానని గతంలో కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఓటు వేసినా.. కాంగ్రెస్‌కు ఓటు వేసినా ఒక్కటేనని.. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు పాల్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించిన ఆయన.. ప్రస్తుత తెలంగాణ మంత్రులపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రులందరూ తెలంగాణ వ్యతిరేకులేనని అన్నారు. ఇదే సమయంలో గద్దర్‌ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు గద్దర్‌ను హింసించిందే చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఇక తాను ఏపీలో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు కేఏ పాల్.

Also Read:

వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

#brs #ka-paul #telangana-elections #telangana-politics #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe