ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు!

ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు..కాంగ్రెస్ లోకి చేరగానే జూపల్లి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు.. ఉద్యమం సమయంలో లక్షలు లేని వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించిన జూపల్లి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని... అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్..

New Update
ఖర్గే సమక్షంలో కండువా కప్పుకున్న జూపల్లి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని పిలుపు!

Jupalli Krishnarao: ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు ఇంకా అనుచరులతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun kharge) సమక్షంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం ఖర్గే నివాసంలో జరిగింది. అయితే వాస్తవానికి వీరంతా కాంగ్రెస్ లో బుధవారమే చేరాల్సి ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే షెడ్యూల్ బిజీగా ఉండడంతో కుదరలేదు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ ఠాక్రే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) , ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్ రావు, మల్లు రవి లు పాల్గొన్నారు.

అయితే జూపల్లి(Jupalli) తో పాటు కొండగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మెఘారెడ్డి, కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇక చాలా కాలం నుంచి జూపల్లి కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి ఆయన పొంగులేటి పార్టీలో జాయిన్ అయిన వెంటనే కొల్లాపూర్లో భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో జాయిన్ కావాల్సి ఉండే. కాని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఫిక్స్ కాకపోవడంతో ఆ సభ వాయిదా పడుతూ వచ్చింది.

టీ కాంగ్రెస్ మాత్రం ఖమ్మం సభ తరహాలోనే కొల్లాపూర్ సభను నిర్వహించాలని చాలా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇలా ఢిల్లీలో ఖర్గే సమక్షంలో ఆయన ఇంకా ఆయన అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ లోకి చేరగానే జూపల్లి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం సమయంలో లక్షలు లేని వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందన్నారు. అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్ అయ్యారు జూపల్లి.

రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.60 ఏళ్ళ పోరాటాల ఆకాంక్షలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ తలకిందులు తపస్సు చేసినా కాంగ్రస్ గెలుపే ఖాయమన్నారు జూపల్లి. ఎన్నికల కోసమే స్కీములు ప్రకటిస్తూ కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం అందరూ తీర్చుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.

Also Read: బీజేపీలోకి క్యాసినో కింగ్.. అగ్రనేతలతో చికోటి ప్రవీణ్‌ భేటీ

Advertisment
Advertisment
తాజా కథనాలు