BREAKING: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. విచారణ అనంతరం చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

BREAKING: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
New Update

Chandrababu Bail Petition: స్కిల్‌ కేసులో (Skill Development Case) తనకు బెయిల్ కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

ALSO READ: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ..

చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని.. ఆయనకు బెయిల్ ఇవ్వదు అంటూ సీఐడీ తరఫున లాయర్లు ధర్మసనాన్ని కోరారు. స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.

ALSO READ: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!

మరోవైపు చంద్రబాబును ఎన్నికల ముందే కావాలని అరెస్ట్ చేశారని, చంద్రబాబుపై నెలన్నరలోనే వరుసగా 6 కేసులు పెట్టారని కోర్టుకు విన్నపించుకున్నారు చంద్రబాబు తరఫున లాయర్లు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, వారు గుండెకు సంబందించిన సమస్యతో బాధపడుతున్నారని.. వారికి మరికొంత సమయం విశ్రాంతి కావాలని.. అందుకోసం ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును చంద్రబాబు లాయర్లు కోరారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందోన్న అంశంపై రాజకీయ వర్గాలతో పాటు టీడీపీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

#chandrababu #chandrababu-bail-petition #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe