USA: దేశాధ్యక్షుడిని అయినా నేనూ తండ్రినే..జోబైడెన్

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్.

New Update
Joe Biden: ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జో బైడెన్‌!

మాదక ద్రవ్యాలు వాడడం, తుపాకీని కొనుగోలు చేయడంలాంటి నేరాల మీద అమెరికా అధ్యక్షుడి కుమారుడు హంటర్ బైడెన్ ను ఫెడరల్ కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. దీని మీద అతని తండ్రి, దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తమ కుమారుడి నేరారోపణల మీద జరిగిన విచారణనను తాను, తన భార్య అంగీకరిస్తున్నామని ఆయన ప్రకటించారు. అయినా కూడా తమ కుమారుడు అంటే తమకు అమితమైన ప్రేమే ఉంది అని చెప్పారు. తాను కూడా అందరిలాగే తండ్రిని అంటూ ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగా తమ కుమారుడిని చూసి తాము గర్వపడుతున్నామని తెలిపారు. హంటర్ తాను ఉన్న పరిస్థితుల నుంచి బటయకు రావడానికి చేసిన ప్రయత్నం మమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తుందని జో బైడెన్ అన్నారు.

హంటర్ బైడెన్ డెలావర్ రాష్ట్రంలో కొకైన్‌ ను వినియోగించినట్లు, తుపాకీని కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు తుపాకీ కొనడానికి అబద్ధం చెప్పినట్టు కూడా తేలింది. డెలావర్ రాష్ట్రం ఫెడరల్ చట్టాల ప్రకారం ఇవన్నీ శిక్షార్హమైన నేరాలు. హంటర్ చేసిన ఈ పనులు నిరూపించబడడంతో ఫెడరల్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.మాదకద్రవ్యాల వినియోగం గురించి ఫెడరల్ స్క్రీనింగ్ ఫారమ్‌లో అబద్ధం చెప్పడం కూడా దోషిగా తేలింది.

54 ఏళ్ళ హంటర్ తన నేరాల మీద జరిగిన విచారణపై పైకోర్టుకు అప్పీల్‌కు వెళుతున్నారు. దీనిపై తండ్రి జోబైడెన్ స్పందిస్తూ తాము అప్పీల్‌కు వెళుతున్నప్పటికీ హంటర్ విచారణ ఫలితాన్ని తాము అంగీకరిస్తున్నామని తెలిపారు. హంటర్‌కు తాను, తన భార్య జిల్ ఎప్పుడూ అండగా ఉంటామని ప్రకటించారు. మా కుటుంబసభ్యులు అందరూ అతనికి మద్దతునిస్తామని తెలిపారు. అది ఎప్పటికీ మారదు అంటూ భావోద్వేగం కూడిన ట్వీట్‌ను చేశారు. తుపాకీ కొనుగోలు, మాదక ద్రవ్యాల వినియోగం మాత్రమే కాకుండా హంటర్ మీద పన్నులను ఎగవేసిన ఆరోపణలు కూడా ఉననాయి. దీని మీద కూడా ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతోంది.

Also Read:Yemen: యెమెన్‌లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి

Advertisment
తాజా కథనాలు