America : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటలీ (Italy) లో జరుగుతున్న జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ భలే వింతగా ప్రవర్తించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) ని ఓ స్టేజ్‌పై కలిసేందుకు వెళ్లిన ఆయన.. ఆ నేతను హగ్ చేసుకున్న తర్వాత.. చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు.
కన్ఫ్యూజన్‌లో ఉన్న బైడెన్.. ఇటలీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది. ఇక మరో వీడియోలో బైడెన్ ఎంత గందరగోళానికి గురవుతున్నారో చాలా క్లియర్ గా తెలిసింది. జీ7 సమావేశాలకు (G7 Meetings) హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కరే మరో వైపు వెళ్లిపోయారు. కొన్ని అడుగుల దూరం వెళ్లిన తర్వాత ఆయన ఎవరూ లేని దిక్కుకు తిరిగి ఆయన చేతిని చూపించారు. మనుషులు లేని దిక్కుకు వెళ్లి బైడెన్ ఎందుకు అలా చేశారో ఎవరికీ తెలియడంలేదు.
కానీ ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలానీ వెంటనే ఆయన వద్దకు వెళ్లి.. బైడెన్ వద్దకు వెళ్లి ఆయన్ను గ్రూప్ నేతలకు దగ్గరకు తీసుకునివచ్చారు. ఆ తర్వాత ఆగ్రూప్ ఫోటోలు దిగారు. జో బైడెన్ ఆరోగ్యంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇటీవల వైట్ హౌస్‌లో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో బైడెన్ ఎటూ కదలకుండా చలనం లేని రీతిలో నిలుచుండిపోయారు. దీన్ని రిపబ్లికన్లు తప్పుపట్టారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. బైడెన్ మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారు. వయసు సంబంధిత సమస్యలతో బైడెన్ బాధపడుతున్నట్లు సమాచారం.
Also read: నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్!