TG ICET 2024 Results : నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్! తెలంగాణ లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించనున్నారు.ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. By Bhavana 14 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ లో ఎంబీఏ (MBA), ఎంసీఏ కోర్సు (MCA Course) ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్- 2024 (TGCET-2024) ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పూర్తిస్థాయి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా ఐసెట్ ర్యాంక్ కార్డ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి- https://icet.tsche.ac.in/. హోమ్ పేజీలో ‘డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్’ లింక్‌పై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘వ్యూ ర్యాంక్ కార్డ్’ బటన్‌పై క్లిక్ చేయాలి. వివరాలు నమోదు చేయగానే కంప్యూటర్ స్క్రీన్‌పై ఐసెట్ ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. అభ్యర్థులు ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాగా, జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. Also read: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త! #telangana #tg-icet-2024 #results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి