Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్

పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇరాన్‌ చేసిన దాడిలో దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులు కూల్చివేశామని చెప్పారు.

Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్
New Update

ఇజ్రాయెల్ - ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి ముదురుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు తాము రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించే విషయంలో ఇజ్రాయెల్ అద్భతం కనబరించిందని నేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పాను. మేము ఇజ్రాయెల్‌కు ఉక్కు కవచంలా రక్షణగా ఉండేందుకు కట్టుబడి ఉన్నాం. ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసేందుకు మేము సాయం చేశాం.ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను నేను ఖండిస్తున్నానని' బైడెన్ అన్నారు. అలాగే నేతన్యాహుతో కూడా ఫోన్‌లో మాట్లాడానని.. తాము ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉండామని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌ చేసిన దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించేలా జీ7 దేశాలను ఒప్పిస్తానని చెప్పారు.

Also Read: ఇరాన్‌ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే

ఇరాన్‌ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులతో తమ దేశంపై దాడులకు దిగిందని ఇజ్రాయెల్ తెలిపింది. వాటిల్లో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకినట్లు పేర్కొంది. అయితే ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌ ప్రాంతంలో ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతింది. ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఇరాన్‌ తమ దేశం నుంచి ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇదిలాఉండగా.. ఇరాన్‌ దాడిపై ఐక్యరాజ్యసమితోలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ సయిద్ ఇర్వానీ స్పందించారు. అవసరమైనప్పుడు ప్రతిసారి తమ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైన సైనిక చర్యలకు పాల్పడితే ఈసారి స్పందన మరింత తీవ్రతరంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో.. సుమారు 70కి పైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించారు. మధ్యధరా సముద్రంలో ఉన్న తమ యుద్ధ నౌకలు స్పందించినట్లు తెలిపారు. ఇరాన్‌ మొత్తం 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారు.

Also Read: సరోగసీపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

#telugu-news #joe-biden #israel #israel-iran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe