Trump VS Biden: హోరాహోరీగా ట్రంప్ - బైడెన్ మధ్య డిబేట్

అమెరికా అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య జరిగిన డిబేట్‌ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. ఈ డిబేట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Trump VS Biden: హోరాహోరీగా ట్రంప్ - బైడెన్ మధ్య డిబేట్
New Update

US Presidential Debate 2024: అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు, డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య జరిగిన డిబేట్‌ ఆసక్తికరంగా సాగింది. 2020 తర్వాత తొలిసారిగా వీళ్లిద్దరూ ఒకరినొకరు తలపడ్డారు. అట్లాంటాలోని సీఎన్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. బెడెన్, ట్రంప్‌లు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. అయితే ట్రంప్ దూకుడు ప్రదర్శించగా.. బైడెన్ పలుమార్లు తడబడినట్లు కనిపించారు. ట్రంప్‌.. బైడెన్‌ను ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. దీంతో బైడెన్‌.. ట్రంప్‌ను దోషి అంటూ విమర్శించారు.

ఈ చర్చల్లో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ విక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా బైడెన్‌ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు పేర్కొ్న్నారు. చివరికి హుందాగా, దీటుగా చర్చను ముగించినట్లు చెప్పారు. ఈ డిటేట్‌లో ట్రంప్‌ 23 నిమిషాల ఆరు సెకన్లు మాట్లాడారు. బెడెన్‌ మాత్రం 18 నిమిషాల 26 సెకన్లు మాట్లాడారు.

Also Read: రాజుల కోసం కాదు, రాణుల కోసం కట్టిన ప్యాలెస్!

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది

2016 నుంచి 2020 వరకు ట్రంప్ పాలనలో పాటించిన ఆర్థిక విధానాలపై బైడెన్‌ విమర్శలు చేస్తూ బైడెన్ చర్చను ప్రారంభించారు. కేవలం సంపన్నులకే అనుకూలంగా ఉన్నారంటూ ఆరోపించారు. దీనివల్లే ఆర్థిక వ్యవస్థ కప్పకూలినట్లు పేర్కొన్నారు. అలాగే ఉద్యోగాల కల్పన పూర్తిగా తగ్గిపోయిందని.. నిరుద్యోగం 15 శాతానికి పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యత ప్రజలు తనపై ఉంచినట్లు తెలిపారు. దీనిపై ట్రంప్ కౌంటర్ వేశారు. బైడెన్ పాలనలో కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శలు గుప్పించారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. పన్ను కోతల వల్ల ఆర్థిక వ్యవస్థ దీన స్థితిలోకి వెళ్లిపోయినట్లు విమర్శలు చేశారు.

బలగాలు వెళ్లిపోవడం ఘోరం

విదేశాంగ విధానం విషయంలో ఇద్దరి మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడం ఘోరమని ట్రంప్ విమర్శించారు. తన హయాంలో సైనికులు గౌరవప్రదంగా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి స్పందించిన బైడెన్.. ట్రంప్ పాలనలో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ పౌరులను చంపుతున్నారని తెలిపారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ విమర్శిచారు. అక్కడ ప్రాణలు కోల్పోయిన అమెరికా సైనికులపై ట్రంప్ దుర్భాషలాడారని అన్నారు. అలాగే ఉక్రెయిన్ - రష్యా గురించి మాట్లాడుతూ.. పుతిన్‌కు ట్రంప్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని.. ఎక్కువమంది సైనికులు చనిపోయినందువల్లే రష్యా ప్రతిదాడులు చేస్తోందని సమర్థించినట్లు బైడెన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు.

వలస విధానం

ఇక వలస విధానంపై ఇరువేరు నేతల మధ్య జరిగిన చర్చ ఆసక్తిరంగా జరిగింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ట్రంప్‌ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు బైడెన్‌ మండిపడ్డారు. తాను అక్రమ వలసదారులను ఆహ్వానిస్తున్నానన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. అయితే దేశ దక్షిణ సరిహద్దులను కాపాడటంలో బైడెన్ విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు. దీన్ని బైడెన్ చేసిన నేరంగా తాను అభివర్ణిస్తానని పేర్కొన్నారు.

కీలకంగా మారిన గర్భవిచ్ఛిత్తి 

గర్భవిచ్ఛిత్తి అంశం ఇప్పుడు అమెరికాలో కీలకంగా మారింది. డిబేట్‌లో ఈ విషయం రావడంతో.. గర్భవిచ్ఛితి నిషేధాన్ని బైడెన్ తప్పుబట్టారు. దీనికి పర్మిషన్ ఇస్తూ ఇచ్చిన 'రో వర్సెస్ వేడ్' తీర్పును పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అయితే గర్భవిచ్ఛిత్తికి సంబంధించి ఆ మహిళ, వైద్యులు తేల్చాల్సిన విషయమని.. రాజకీయ నాయకులు కాదని బైడెన్ అన్నారు. ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్ అన్నారు. గర్భవిచ్ఛిత్తిపై ఎటువంటి పరిమితులు లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Also Read: ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 5 దేశాలు!

ఇజ్రాయెల్‌వైపే ఇద్దరి మద్ధతు

ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బైడెన్.. ఇజ్రాయెల్‌కు తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలకు పూర్తిగా హమాస్‌దే బాధ్యత అంటూ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు వాళ్లే ముందుకు రావడం లేదని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇజ్రాయిల్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే దీనికి సంబంధించి ముగింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్‌ కూడా ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చారు. అయితే బైడెన్ వైఖరిలో మాత్రం మార్పు వచ్చిందని.. ఓ పాలస్తీనావాసిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.

గెలిచేదేవరో

ఈ చర్చలో కొవిడ్ -19, సామాజిక భద్రత, పన్నులు, మెడికేర్‌, ట్రంప్‌పై ఉన్న కేసులు, 2020లో జరిగిన క్యాపిటల్ దాడుు, మాజీ సైనికుల భద్రత, నాటో వంటి అంశాలపై కూడా ఇరువురు నేతలు ఒకరికొనకరు విమర్శించుకున్నారు. అయితే చివరికి ఈ చర్చల్లో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ విక్షకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారనేదానిపై దానిపై ఉత్కంఠ నెలకొంది.

#trump #america-elections #debate #biden #usa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe