Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు

ఆంధ్రా నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతోంది.

Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు
New Update

Jobs at Visakha, Vijayawada Airports: ఆంధ్రాలో విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ నుంచి దాదాపు అన్ని ప్రాంతాలకు విమానాలు వెళతాయి. విశాఖ నుంచి అయితే అంతర్జాతీయ విమానాలు కూడా ప్రయాణిస్తాయి. విశాఖ విమానాశ్రయం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగాల కోసం ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానాశ్రాల్లో సర్వీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయంటూ ప్రకటన జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తారని తెలిపింది. ప్రస్తు ఉద్యోగాల భర్తీతో పాటూ భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలకు కూడా వెయిట్ లిస్ట్ జాబితాను రూపొందిస్తారని వెల్లడించింది.

వాకిన్ సెలక్షన్స్...

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ ఆఫీసర్ ఖాళీ ఉద్యోగాలు ఐదు, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 22, జూనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 14, హ్యాండీమాన్ ఉద్యోగాలు 36 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ముందు రాత పరీక్షలు ఏమీ ఉండవు. డైరెక్ట్‌గా వాకిన్ సెలక్షనే ఉంటుంది. మార్చి 9వ తేదీని వాకిన్ సెలక్షన్ జరగనుంది. ఉదయం 9.30 నుంచి 12.30 ఈ ప్రక్రియ జరుగుతుంది. హ్యండీ మ్యాన్ ఉద్యోగాలు మాత్రం మార్చి 11వ తేదీన ఉదయం 9.30 నుంచి 12.30 మధ్యలో జరగనున్నాయి.

ఉద్యోగ అర్హతలు...

ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే అభ్యర్ధులకు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. మొత్తం 9 ఏళ్ళ అనుభవం ఉండాలి అని చెబుతున్నారు.దాంతో పాటూ కనీసం ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలి. జూనియర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్టంగా 35ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ళ సడలింపు ఉంటుంది. అంతేకాదు ప్యాసింజర్ చెక్‌ ఇన్‌, కార్గో హ్యండిలింగ్‌లో అనుభవం ఉండాలి. నెలకు 29,760 రూ. జీతం చెల్లిస్తారు. ఇంగ్లీషు, హిందీ భాషలు వచ్చి ఉండాలి. ఎంబీఏ, ఏవియేషన్ రంగంలో ఆఏళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. వీటన్నింటితో పాటూ అభ్యర్ధులకు కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా కచ్చితంగా వచ్చి ఉండాలి.

ఇక కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలతో పాటు ఎయిర్‌లైన్‌, జిహెచ్‌ఏ, కార్గో, ఎయిర్‌లైన్‌ టికెటింగ్, ఎయిర్‌లైన్ డిప్లొమా, ఎయిర్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు రూ.24,960, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.21,270 జీతం ఇస్తారు.అలాగే హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాషను చదవగలిగి ఉండాలి. వీటికి రూ.18,840 జీతాన్ని నిర్ణయించారు. నిర్దేశిత దరఖాస్తుతో పాటు విద్యార్హతలతో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిఎన్‌ఎస్‌ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్‌లో వాకిన్ సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఓల్డ్ ఎయిర్‌ పోర్ట్ కార్గో టెర్మినల్‌లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దరఖాస్తుదారులు కచ్చితంగా భారత పౌరులై ఉండాలి.

విజయవాడ ఉద్యోగాలు..

విజయవాడ విమానాశ్రయంలో మార్చి 16న ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు వాకిన్ సెలక్షన్ ఉండనుంది. ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2, హ్యాండీ మ్యాన్ ఉద్యోగాలు 16 ఉన్నాయి.మార్చి 16వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజీ ప్రాంగణంలో ఎంపికలు నిర్వహిస్తారు. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు.. మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రొడక్షన్, ఆటోమోబైల్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల్లో మూడేళ్ళ డిప్లొమా కలిగి ఉండాలి. ఐటిఐ విద్యార్హతతో పాటు ఎన్‌సిటివిటి శిక్షణ పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో పాటు హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 28 ఏళ్ళలోపు వారు మాత్రమే అర్హులు. ఇక వీటి జీతం రూ.24.960.

హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమన్ ఉద్యోగాలకు అయితే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాషను చదవగలిగి ఉండాలి. రూ.18,840 జీతం ఇస్తారు. విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌లలో ఉద్యోగాల నోటిఫికేషన్లను https://www.aiasl.in/Recruitment వెబ్‌సైట్‌లో చూడవచ్చును.

Also Read:Telangana: విద్యార్ధులకు అలెర్ట్..ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

#vijayawada #airport #visakhapatnam #jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe