Telangana : తెలంగాణ విద్యుత్ మండలిలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రభుత్వం వరాలు కురిపిస్తూనే ఉంది. ఏళ్ళ తరబడి భర్తీలు కాకుండా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఇప్పుడు వరుసపెట్టి భర్తీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వివరాల కోసం ఈ న్యూస్ మొత్తం చదివేయండి. By Manogna alamuru 09 Mar 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jobs In TSERC : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడిన దగ్గర నుంచి నిరుద్యోగుల మీద వరాల జల్లులు కురిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు హామీల్లో వాగ్దానం చేసినట్టు వరుసపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలను పూరిస్తోంది. పోలీసు ఉద్యోగాలు, డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఇలా ఒకదాని తరువాత ఒకటి జాబ్స్ ప్రకటనలను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా విద్యుత్ శాఖలో భర్తీల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(TSERC) లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 26 జాబ్స్ కోసం ప్రకటన జారీ చేశారు. ఇందులో ఒక జాయింట్ డైరెక్టర్, 10 డిప్యుటీ డైరెక్టర్లు, ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక క్యాషియర్, ఒక లైబ్రేరియన్, రెండు స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 4 క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, రెండు పర్శనల్ అసిస్టెంట్, ఒక రిసెప్షనిస్ట్, 5 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులున్నాయి. https://tserc.gov.in వెబ్ సైట్‌లో పూర్తి వివరాలున్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 1వ తేదీ చివరిరోజు. దీంతో పాటూ రాష్ట్రంలో నాలుగు విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర శాఖలు, ఇతర రాష్ట్రాలు, తెలంగాణలోని పలు వాఖల్లో పని చేస్తున్న చీఫ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు, రిటైర్డ్ అధికారులు ఈ ఉద్యోగానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జెన్‌కోలో 5, ట్రాన్స్‌కోలో 3, ఉత్తర, దక్షిణ డిస్కంలలో 10 డైరెక్టర్ పోస్టులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో జెన్‌కోలో 5 పోస్టులకు 147 దరఖాస్తులు రాగా..మిగతా సంస్థల్లో దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తున్నారు. Also Read : Movies : శివరాత్రి ట్రీట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల #telangana #electricity #jobs #dsc-job-notification #tserc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి