Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో HCLలో ఉద్యోగాలు!

ఇంటర్మీడియట్ అర్హతగల నిరుద్యోగులకు ఇంటర్‌ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. CEC, HEC, BiPC, ఒకేషనల్ కోర్సులో 75% మార్కులున్న అభ్యర్థులు HCLలో డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో HCLలో ఉద్యోగాలు!

HCL Jobs : నిరుద్యోగులకు ఇంటర్‌ విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ మేరకు ఇంటర్ అర్హత గల అభ్యర్థులు HCLలో డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ.. ఏడాది ట్రైనింగ్ తర్వాత HCLలో పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తారని స్పష్టం చేసింది. మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ, తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. స్టైపెండ్‌ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు.

విద్యార్హత:
CEC, HEC, BiPC, ఒకేషనల్ కోర్సులో 75%+ మార్కులు ఉండాలి.
ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.

ఎంపిక:
ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు 7981834205, 9063564875, 8341405102లో సంప్రదించాలని తెలిపింది.

అధికారిక వెబ్ సైట్: https://www.naukri.com/hcl-infosystems-jobs-careers-504

Advertisment
Advertisment
తాజా కథనాలు