TG Young India Skills University: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో(YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4నుంచి కోర్సులు మొదలుకానుండగా.. తొలి విడతగా 3 స్కూల్స్ ఏర్పాటు చేసి అందులో 4 కోర్సులను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.
ఇది కూడా చదవండి: పొట్టి టాప్, టైట్ జీన్స్..ఈ ముద్దుగమ్మ అందాలు చూస్తే ఫ్లాట్
ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలు..
ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను మొదటగా ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో ఫార్మా, కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ ఉన్నాయి. ప్రతి కోర్సును ఓ కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఆనంద్ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇది కూడా చదవండి: Soap: కుటుంబమంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?..అయితే జాగ్రత్త
ఇది కూడా చదవండి: బ్రాను అలా ధరిస్తే క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!