Soap: కుటుంబమంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా?..అయితే జాగ్రత్త

కొందరి ఇంట్లో ఒకే సబ్బును ఉపయోగించి స్నానం చేస్తారు. తాగా చేసిన అధ్యయనంలో సబ్బుపై రెండు నుంచి ఐదు రకాల బ్యాక్టీరియా పేరుకుపోవటంతోపాటు 62 శాతం సబ్బులు మురికిగా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా వలన ఇతర వ్యాధులు వ్యాపిస్తాయా నిపుణులు చెబుతున్నారు.

New Update
soap bathing

Soap Bathing

Soap: చాలా భారతీయ కుటుంబాలలో ఇంటి మొత్తం ఒకే సబ్బును ఉపయోగించి స్నానం చేస్తారు. ఆ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా.. వాడిన సబ్బునే వాడతారు. అయితే ఈ చిన్న సబ్బుకు ఒకరి శరీరంలోని ఇన్ఫెక్షన్‌ను మరొకరికి వ్యాపింపజేసే శక్తి ఉంటుంది. కొందరు తాము వాడే సబ్బును ఇతరులతో పంచుకోరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా సబ్బును ఉపయోగించడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సబ్బు కడ్డీలపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఒక అధ్యయన నివేదిక ప్రకారం.. సబ్బుపై రెండు నుంచి ఐదు రకాల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. 62 శాతం సబ్బులు మురికిగా ఉన్నట్లు తేలింది.

సబ్బుపై రెండు నుంచి ఐదు రకాల బ్యాక్టీరియా...

సబ్బులోని లిక్విడ్ కంటెంట్ బ్యాక్టీరియా ఒకరి శరీరం నుంచి మరొకరికి వ్యాపించేలా చేస్తుంది. సబ్బులో పెరిగే బ్యాక్టీరియాలలో ఈ కోలి, సాల్మొనెల్లా ఉన్నాయి. ఇవి నోరోవైరస్, రోటవైరస్ వంటి వాటిని వ్యాప్తి చేస్తాయి. ఈ బ్యాక్టీరియా శరీరంపై గాయాలు, చర్మంపై చిన్న గీతలు పడటం ద్వారా సంక్రమణ చెందుతాయని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ఉన్న వ్యక్తి సబ్బును ఉపయోగించినప్పుడు,  బ్యాక్టీరియా సబ్బుకి అంటుకుంటుంది. 

ఇది కూడా చదవండి:  క్యాన్సర్‌ వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి

సబ్బు ద్వారా బాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందనడానికి అనేక శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ సబ్బు ద్వారా ఇతర వ్యాధులు వ్యాపిస్తాయా అనే దానిపై 1965 లో ఒక అధ్యయనం జరిగింది. ఇందులో చేతులపై బ్యాక్టీరియా ఉన్న వ్యక్తికి సబ్బుతో చేతులు కడుక్కోవాలని చెప్పారు. తర్వాత మరో వ్యక్తి చేతులు కడుక్కోవాలని చెప్పారు. కానీ అతని శరీరంలోకి మరే ఇతర బ్యాక్టీరియా చేరలేదు. కాబట్టి సబ్బు వల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ తప్ప మరే ఇతర వ్యాధులు వ్యాపించవని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇంట్లో ఇలా చేస్తే జిమ్‌కు వెళ్లే అవసరం ఉండదు

Advertisment
Advertisment
తాజా కథనాలు